VIDEO: గాలి, వాన బీభత్సం.. భారీ వర్షం

VIDEO: గాలి, వాన బీభత్సం.. భారీ వర్షం

KDP: జిల్లాలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముద్దనూరు మండలం కొత్తపల్లెలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో మోస్తరు వర్షం పడుతోంది. పోరుమామిళ్లలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది.