కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

SRPT: కోదాడ మండల పరిధిలోని కూచిపూడిలో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సీతారం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.