పైలట్లు, ఏటీసీలకు డీజీసీఏ కీలక సూచన
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. GPS అసాధారణ చర్యను ఎవరైనా పైలట్, ATC కంట్రోలర్ లేదా టెక్నికల్ యూనిట్ గుర్తించిన వెంటనే సంబంధిత విభాగానికి తెలపాలని సూచించింది. అలాగే విమానం వివరాలు, ఘటన జరిగిన సమయం, తేదీ, ఏ రూట్‌లో జరిగిందనేది కూడా చెప్పాలని పేర్కొంది.