బీసీ గళం సభను విజయవంతం చేయాలి: రమేష్ గౌడ్
ATP: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో బీసీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న 'బీసీ గళం' సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతను చాటేలా ఈ సభ ఉండాలని నేతలు ఆకాంక్షించారు. బీసీ నేతలందరూ పాల్గొన్నారు.