జూబ్లీహిల్స్‌లో కోడ్ ఉల్లంఘన.. 27 కేసులు!
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్‌లో ఉందని ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది రెడీగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద వివిధ పోలీస్ స్టేషన్లలో 27 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.