కాంగ్రెస్ సీనియర్ నేత శిరంగు సత్తిరాజు మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత శిరంగు సత్తిరాజు మృతి

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు శిరంగు సత్తిరాజు(బాబు) గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన గ్రామ సర్పంచ్‌ గా మూడుసార్లు ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారు.