ఉయ్యూరులో వరి పంట దగ్ధం
కృష్ణా: ఉయ్యూరు రాజేంద్రనగర్ స్మశాన వాటిక సమీపంలో రైతు ఎం.భాగ్యలక్ష్మికి చెందిన రెండు వరికుప్పలు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. రాత్రి కావడంతో విషయం ఆలస్యంగా తెలియడంతో, అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే పంట పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో మహిళా రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.