సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్థుల తరలింపు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్థులందరూ ఢిల్లీ చేరుకుంటున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్‌లో సుమారు 10 వేల మంది తెలుగు విద్యార్థులున్నట్లు గుర్తించారు. అందులో 6 వేల మంది ఇప్పటికే పంజాబ్‌ను వీడారు. కాగా, J&K NITలోనూ తెలుగు విద్యార్థులున్నట్లు అధికారులు వెల్లడించారు.