VIDEO: వెంకన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ వెంకన్న దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం గరుడ సేవ, గ్రామోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు.