ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
KNR: జమ్మికుంటలోని MPPS గర్ల్స్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు DEO మొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తూ, తప్పులను ఎత్తిచూపుతూ SMవేదికగా వ్యాఖ్యలు చేయడం సేవా నియమావళికి విరుద్ధమని డీఈవో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అనే నిబంధనలను ఉల్లంఘించినందుకు తక్షణ సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు.