రైతులకు సబ్సిడీ పరికరాల పంపిణీ

రైతులకు సబ్సిడీ పరికరాల పంపిణీ

SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతులకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సబ్సిడీ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం మాట్లాడుతూ.. 50% సబ్సిడీతో ప్రభుత్వం ఈ పరికరాలను పంపిణీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండేపల్లి సర్పంచ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.