రాజుపేటలో మురికి కాలువల సమస్య
NLG: తిప్పర్తి (M) రాజుపేటలో ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న మురికి కాల్వ చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూర్తిగా నిండిపోయింది. దీంతో నీటి ప్రవాహం ఆగిపోయి దుర్వాసన వస్తోంది. ఈ దారుణ పరిస్థితి వల్ల దోమలు పెరిగి, ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని పలుచోట్ల ఇలాంటి సమస్యలే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.