సురవరం మృతి పట్ల నారాయణ సంతాపం

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సీపీఐ నేత నారాయణ సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి పార్టీ, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.