ప్రతి ఉద్యోగికి బదిలీ సహజం: ఎస్పీ
SGR: జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి హైదరాబాద్ కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీపై వెళ్తున్న కళ్యాణిని ఎస్పీ పారితోష్ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కళ్యాణి మూడు సంవత్సరాల నుంచి కార్యాలయంలో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఉద్యోగికి బదిలీ సహజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.