అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం దివిటిపల్లి గ్రామానికి చెందిన అంజలి (24) అంబులెన్సులో ప్రసవించింది. శుక్రవారం ఉదయం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ అనిత, పైలెట్ కృష్ణయ్య అంబులెన్స్ ఆమెకు ప్రసవం చేశారు. అంజలి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు.