నేడు జిల్లాలో మంత్రి పర్యటన

నేడు జిల్లాలో మంత్రి పర్యటన

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కూసుమంచి, నేలకొండపల్లి, ఏదులాపురం, మణుగూరు, లక్ష్మీదేవిపల్లిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.