'మెరుగైన వైద్య సేవలు అందించాలి': కలెక్టర్
PDPL: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఈ మేరకు ఆయన జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలు, ఓ పి వివరాలు పరిశీలించారు. వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, ముఖ్యంగా ఓపి సమయాల్లో తప్పనిసరిగా హాజరై ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.