పదవి విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సత్కారం 

పదవి విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సత్కారం 

కృష్ణా: పదవి విరమణ చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధరరావు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం పోలీస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన SI-777 A.K. జిలానీ, ASI- 935 V.S.S. ప్రసాద్‌లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు.