కామేపల్లిలో తాగునీటి సమస్యపై ఆందోళన
BPT: సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో శుద్ధి చేసిన నీటిని అందించగా, ప్రస్తుతం పాడైన నీరు వస్తోందని తెలిపారు. కుళాయి వ్యవస్థ దెబ్బతిని నీరు వృథాగా కాలువల్లోకి పోతుందని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని జనసేన ఉపాధ్యక్షులు ఎస్‌కె.మీరావాలి కోరారు.