రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
PLD: సత్తెనపల్లిలోని బాలాజీ స్వీట్స్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న శివ నాగేశ్వరరావును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.