VIDEO: రతన్ టాటాకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పుత్త

KDP: ప్రపంచం మొత్తం అభినందించే వ్యక్తి భారత రత్నం రతన్ టాటా మరణించడం అత్యంత దురదృష్టకరమని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్య అన్నారు. కడపలోని ఆయన కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్షల కోట్లు సంపాదించుకునే వీలున్నా, వ్యక్తి కాదు దేశం ముఖ్యం అని నమ్మిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిదన్నారు.