విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వారోత్సవాలు

KMR: విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ విజయసారథి పేర్కొన్నారు. లింగంపేట విద్యుత్ ఉపకేంద్రంలో శుక్రవారం విద్యుత్ భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ మోటార్ల వద్ద నాణ్యమైన సర్వీస్ వైర్లు, స్టార్టర్ డబ్బాలను బిగించుకోవాలని సూచించారు.