నేడు జనసేన క్రియాశీలక సమావేశం
SKLM: లావేరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం. 3 గంటలకు జరిగే కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు హాజరవుతారు అని తెలిపారు.