రైతుకు లక్కీ డ్రాలో ఎలక్ట్రానిక్ బైక్ సొంతం

SDPT: మండల కేంద్రంలోని నర్మదా హెచ్పీ ఫీలింగ్ స్టేషన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో బెజ్జంకి గ్రామానికి చెందిన రైతు గూళ్ల సంజీవ ఎలక్ట్రానిక్ బైక్ గెలుచుకున్నాడు. గత మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే ఇంధనం పోయించుకున్న వినియోగదారులకు ప్రతి సారి లక్కీ టోకెన్లు అందజేశారు. ఈ టోకెన్ల ఆధారంగా సోమవారం డ్రా నిర్వహించగా సంజీవ గెలుచుకున్నాడు.