'విద్యార్థుల్లో రచనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యం'

'విద్యార్థుల్లో రచనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యం'

MDK: బీబీపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 'సృజనాత్మక సాహిత్య కార్యశాల' నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, పఠన, రచనా నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు స్వయంగా కథలు రాశారు. ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి సాహిత్య ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.