దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ఫైజాన్ అహ్మద్
NRML: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, విద్య, వైద్యం, ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.