భారీగా గుట్కా పట్టివేత
WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ తనీఖిలో మాదారపు రమేష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.10,980 విలువైన అంబర్, ఆర్‌ఆర్ టొబాకోతో పాటు ఓస్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.