జిల్లాను ఓటింగ్‌లో టాప్‌లో ఉంచాలి: కలెక్టర్

జిల్లాను ఓటింగ్‌లో టాప్‌లో ఉంచాలి: కలెక్టర్

MDK: ఓటింగ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.