ఐస్ క్రీం వాహనాలకు నో ఎంట్రీ.. ఫ్లెక్సీలు ఆవిష్కరణ
JGL: కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయించే బైకులు, ఆటోలకు 'నో ఎంట్రీ' అంటూ శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గ్రామంలో ఐస్ క్రీమ్ విక్రయించే వాహనాలు తిరిగితే రూ. 5 వేలు జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఫ్లెక్సీని సర్పంచ్, వార్డు సభ్యులు ఆవిష్కరించారు.