గృహ నిర్మాణ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వెలంపేట పోస్ట్ ఆఫీస్ వద్ద స్థానికుల గృహ నిర్మాణ సమస్యపై దృష్టి సారించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం వెలంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే, స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు.