VIDEO: అక్రమ కట్టడాల తొలగింపు..రోడ్లకు మహర్దశ
SRPT: మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డులో అక్రమ కట్టడాలను కార్యదర్శి నాగరాజు నేతృత్వంలో జేసీబీతో తొలగించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగడంతో ఇరుకు దారి విశాలంగా మారింది. అక్రమ కట్టడాల క్లియరెన్స్‌పై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.