లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం

GNTR: గుంటూరు బ్రాడీపేటలోని లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన ఆదివారం కలకలం రేపింది. బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి అసభ్య మెసేజ్‌లు, అబ్బాయిలను హాస్టల్‌లో ఉంచడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.