క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఐ
ప్రకాశం: గిద్దలూరు రూరల్ సర్కిల్లో సీఐ రామకోటయ్య SHOలు, స్టేషన్ రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్లతో క్రైమ్ రివ్యూ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షించి, విచారణ వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సీఐ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల, కొమరోలు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.