ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం

ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం

వచ్చే నెలలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ సజావుగా జరిగేలా సహకరించాలని కోరుతూ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు నిర్వహించనున్నారు. ఈ నెల 30 అన్ని రాజకీయ పార్టీల నేతలతో కేంద్రమంత్రి భేటీకానున్నారు. ఈ సెషన్‌లో ప్రవేశపెట్టే పలు బిల్లులపై ఆయా పార్టీల మద్దతును కోరనున్నారు.