యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం

యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, 40 రకాల పెట్రో కెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 30 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతర్జాతీయంగా సరఫరా ఇబ్బందులు, పెరుగుతున్న ధరల నుంచి దేశీయ పరిశ్రమలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.