పెరగనున్న HYD మెట్రో రైలు ఛార్జీలు!

TG: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. ఈ నెల రెండోవారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. దీని ద్వారా మెట్రో సంస్థ వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 ఉన్న ఛార్జీలు.. గరిష్టంగా రూ.75 వరకు పెరగనునట్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల మెట్రో ప్రయాణికులకు కొంత భారంగా మారనుంది.