డబ్బును యజమానికి అప్పగించిన మహిళలు
GDWL: గద్వాల పట్టణంలో రోడ్డుపై దొరికిన రూ.10వేలను ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు పోగొట్టుకున్న వ్యక్తికి శుక్రవారం అందజేశాడు. ప్రభుత్వ బాలికల పాఠశాల ముందు గురువారం దయాందన స్కూల్ పీటీ తిమన్నకు చెందిన ఆ డబ్బులు దౌదర్‌పల్లికి చెందిన ముగ్గురు మహిళలకు దొరికాయి. ఆ మహిళలు నిజాయితీకి నిదర్శనంగా ఎస్ఐ అప్పగించగా, ఎంక్వయిరీ చేసి నిర్దారించి యజమానికి అందజేశారు.