మహా కుంభమేళాలో పాల్గొనాలని బండి సంజయ్‌కి ఆహ్వానం

మహా కుంభమేళాలో పాల్గొనాలని బండి సంజయ్‌కి ఆహ్వానం

KNR: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రికి ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్ అక్కడి ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను అందజేశారు. మహా కుంభమేళానికి అధికారిక ఆహ్వానం అందినందుకు సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. గొప్ప ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.