24 నుంచి ఉపాధ్యాయులకు వైద్య శిబిరం

ELR: పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీ/స్పెషల్ పాయింట్లు పొందాల్సిన వారు వైద్య శిబిరాలకు హాజరుకావాలని డీఈఓ వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు.