VIDEO: ఎడ్ల బండిని.. ఢీ కొట్టిన ఆటో

VIDEO: ఎడ్ల బండిని.. ఢీ కొట్టిన ఆటో

MLG: వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ శివారులో ఇవాళ వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటో బోల్తా పడింది. ఎడ్ల బండిని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలు గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.