భక్తుడి నిర్లక్ష్యం.. కాలిబూడిదైన ఆలయం
భక్తుడు చేసిన పనికి చైనాలోని పురాతన ఆలయమే దగ్ధమైంది. ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన భక్తుడు దైవ ప్రార్థన కోసం వెలిగించిన కొవ్వొత్తిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో మంటలు ఎగసిపడి ఆలయం మొత్తం కాలిబూడిదైంది. వెంచాంగ్ పెవిలియన్ ఆలయం శిథిలాల కుప్పగా మారిపోయింది. కాగా ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తైన తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.