ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
KKD: నేరాల నియంత్రణలో భాగంగా తుని రైల్వే స్టేషన్‌లో GRP ఎస్సై శ్రీనివాసరావు బృందం శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఒకటో ఫ్లాట్ ఫాంపై అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ప్యాషన్ బైక్,13.5 గ్రాముల బంగారము, 3 సెల్ ఫోన్ లు,రూ.40,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.