గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలి

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలి

KNR: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రతి శనివారం నడిచే గరీబ్ రథ్(12611) ఎక్స్‌ప్రెస్ రైలుకు జమ్మికుంటలో హాల్టింగ్ ఇవ్వాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే వారికి ఈ రైలు సౌకర్యంగా ఉంటుందని హాల్టింగ్ కల్పించాలని కోరుతున్నారు.