మాగంటి కుటుంబంలో వివాదాలు?
HYD: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌కి సమయం దగ్గర పడుతున్న క్రమంలో BRS అభ్యర్థి మాగంటి సునీతకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఆమెకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినిదేవి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు శేరిలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. దీనిపై విచారణ హియరింగ్‌కు పిలుపునివ్వగా.. మాగంటి తల్లి, మొదటి భార్య హాజరుకానున్నారు.