దివ్యాంగులకు రూ.1.5 కోట్ల ఉపకరణాల పంపిణీ

CTR: కుప్పం మండల పరిధిలోని పలువురు దివ్యాంగులకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సోమవారం ఉపకరణాలను పంపిణీ చేశారు. రూ.1.5 కోట్లు విలువచేసే బ్యాటరీ ట్రై సైకిల్, వీల్ చైర్, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన స్మార్ట్ ఫోన్, వాకింగ్ స్టిక్, ట్రై సైకిళ్లు స్థానిక బాలల ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.