జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

నిర్మల్: జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తూ ఈ విగ్రహం గణపతి సుఖాసన స్థితిలో ఉంది.