‘రూ.30 వేలు ఇస్తే.. రూ.లక్ష నకిలీ నోట్లు సొంతం'

‘రూ.30 వేలు ఇస్తే.. రూ.లక్ష నకిలీ నోట్లు సొంతం'

VSP: పెందుర్తి కేంద్రంగా నడుస్తున్న నకిలీ కరెన్సీ దందాను కృష్ణా పోలీసులు బట్టబయలు చేశారు. 'రూ.30 వేల అసలు నగదు ఇస్తే.. రూ. లక్ష నకిలీ నోట్లు మీ సొంతం' అంటూ ఆశ చూపుతూ మోసానికి పాల్పడినట్లు SP విద్యాసాగర్ వెల్లడించారు. ఈ కేసులో పెందుర్తికి చెందిన ప్రధాన నిందితుడు రంజిత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిని ఈనెల 3న అదుపులోకి తీసుకున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు.