'అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు ఇవాళ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.