ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

BDK: చర్ల సరిహద్దులోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బర్సూర్ ప్రాంతంలోని సత్గర్, మాలేవాహి మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న CRPF జవాన్లు ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.