దుగ్గిరాల-గుంటూరు బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని డిమాండ్
గుంటూరు-దుగ్గిరాల ఆర్టీసీ బస్సు సర్వీసును తక్షణమే నడపాలని వైసీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతంలో రెండు పూటలా బస్సులు నడిచేవని, నందివెలుగు, కొండూరు, నంబూరు మీదుగా సర్వీసులు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక్క సర్వీసు కూడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.